నిర్మల్ జిల్లా వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యాపారి నుంచి పన్ను తగ్గించడానికి గోదావరి, సీనియర్ ఆసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. లంచం ఇవ్వడానికి ఇష్టపడని సదరు వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ దాడులు జరిగాయి.
రూ.50 వేల లంచం
వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, గోదావరి, సీనియర్ ఆసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణలు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టారు.











