నందుర్బార్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 09
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మైనర్లు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడిన చేతన్ ప్రకాశ్ కోలీ(22)ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి ఫోన్లో 600కు పైగా అసభ్యకరమైన వీడియోలను గుర్తించారు.
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మైనర్లు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడిన చేతన్ ప్రకాశ్ కోలీ(22)ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి ఫోన్లో 600కు పైగా అసభ్యకరమైన వీడియోలను గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు.
డబ్బు ఆశ చూపి బ్లాక్మెయిల్
డబ్బు ఆశ చూపి మైనర్లను లోబర్చుకుని, వారి వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడేవాడని తెలిపారు. నాలుగేళ్లుగా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
పోలీసుల విచారణ
ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












