మిర్యాలగూడ, జూలై 25
మిర్యాలగూడలో అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్ షేక్ నాగుల్ మీరాను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 2తులాల బంగారు పుస్తెల తాడు, 4.3తులాల బంగారు చైన్, ఒక తులం నల్లపూసల గొలుసు, యాక్టీవ్ స్కూటీ, స్మార్ట్ ఫోన్, టోపీ, కర్చిఫ్ స్వాధీనం చేసుకున్నారు.
అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్ షేక్ నాగుల్ మీరాను శనివారం మధ్యాహ్నం అరెస్టు చేసి, 2తులాల బంగారు పుస్తెల తాడు, 4.3తులాల బంగారు చైన్, ఒక తులం నల్లపూసల గొలుసు, ఒక యాక్టీవ్ స్కూటీ, రెడ్మీ ఎ2 లైట్ గ్రీన్ కలర్ స్మార్ట్ ఫోన్, టోపీ, కర్చిఫ్ స్వాధీనం చేసుకున్నట్టు నల్లగొండ జిల్లా పోలీస్ అదనపు సూపరింటెండెంట్ జి.రమేష్ తెలిపారు.
శనివారం మధ్యాహ్నం మిర్యాలగూడ ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 12న మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఎన్విఆర్ పీవీఆర్ గార్డెన్స్ వెనుక విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు ఇంటి ముందు నిల్చుని ఉండగా, ఆమెను ఒకరి అడ్రెస్ అడుగుతూ, ఆమె కరివేపాకు తెంపుతూ ఫోన్ మాట్లాడుతుండగా, కరివేపాకు కావాలని అడిగి ఆమె మెడలో నుండి బలవంతంగా బంగారు అభర్ణాలు లాక్కుని పరారయ్యాడని తెలిపారు.
శనివారం పట్టణంలోని ఫ్లై ఓవర్ వద్ద మరో స్నాచింగ్ కు యత్నిస్తుండగా అతన్ని పట్టుకున్నామన్నారు. పరకసర్ల బంగారుతాడు, నల్లపూసల బంగారు చైన్ ను లాక్కుని పోయిన దొంగను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసును చేదించి అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.
నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపూర్ కు చెందిన వాడని తెలిపారు. దాచేపల్లిలో ఒక హత్య చేసి, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో గొలుసులు లాక్కెళ్ళే పనులు చేస్తు కర్ణాటకలో 8 స్నాచింగ్, 2 రాబరీ కేసులున్నాయని తెలిపారు.
కేసును ఇంచార్జి డిఎస్పీ రవి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ప్రోబషనరీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కాన్స్టేబుల్ రాజారాం, కాన్స్టేబుల్ నల్లగాంతుల శ్రీను, శీలం వెంకటేశ్వర్లు, గద్దల హుస్సేన్, బి వీరబాబు, జె నర్సిహ, ప్రసాద్ లను ఏఎస్పీ రమేష్ అభినందించారు.












