సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) తుదిశ్వాస విడిచారు.
గత కొన్నేళ్లుగా సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. నేడు పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. పాలమూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి 1998, 2004లో నల్గొండ నుంచి చట్టసభలకు ఎంపిక అయ్యారు