జర్నలిస్టుపై దాడి – సీపీఐ నేత అనుచరుల దుశ్చర్య
మనోరంజని తెలుగు టైమ్స్ సిద్ధిపేట ప్రతినిధి అక్టోబర్ 07
సిద్దిపేట జిల్లా సీపీఐ కార్యదర్శి మంద పవన్ పై వచ్చిన అవినీతి ఆరోపణల వార్తను ప్రసారం చేసిన యూట్యూబ్ జర్నలిస్టుపై దాడి జరిగింది. డి. బి.సి న్యూస్ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు మరియు ఇండిపెండెంట్ జర్నలిస్టైన దేవులపల్లి భూపతి పై ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఇటీవల మంద పవన్‌పై వచ్చిన ఆరోపణల వార్తల అనంతరం, ఆయన అనుచరులు భూపతిని లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భూపతి సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. జర్నలిస్టుల భద్రతపై ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో, మీడియా స్వేచ్ఛను గౌరవించాలి, జర్నలిస్టులపై దాడులు ఆపాలి అంటూ స్థానిక మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.