పిడుగుపాటుకు ఆవు మృతి – రైతు నష్టపోయిన ఘటన
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలం :
ఆదివారం సాయంత్రం బంద్రేవ్ తండాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక రైతు ఆడే కిషన్కు చెందిన ఆవు మేతకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా వర్షం కురిసి పిడుగు పడింది. దాంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.
గ్రామస్థుల సమాచారం ప్రకారం ఆ ఆవు విలువ సుమారు ₹30 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ సంఘటనతో రైతు తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యాడు. ప్రభుత్వం బాధితుడిని తక్షణమే ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.