సారంగాపూర్, 2026-08-24
సారంగాపూర్ మండలం యాకర్పల్లి గ్రామం నుండి వంజర్ గ్రామాన్ని కలుపుతూ స్వర్ణ వాగుపై లో లెవల్ వంతెన నిర్మించాలని కోరుతూ యాకర్పల్లి గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తులు సోమవారం మండల ప్రజావాణి కార్యక్రమంలో తహశీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు.

రైతులు, విద్యార్థుల ఇబ్బందులు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాకర్పల్లి నుండి వంజర్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరం ఉన్నా వంతెన లేకపోవడంతో రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాగు అవతల 400 ఎకరాల భూములు ఉన్నాయని, వర్షాకాలంలో వాగు ఉధృతికి దాటడానికి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవాలయ ఉత్సవాలకు ఆటంకం
మండల కేంద్రంలో గల శ్రీ మహా పోచమ్మ దేవాలయం యొక్క గంగనీళ్ల జాతరలో భాగంగా అమ్మవారి నగలను శుద్ధి చేయడానికి ఇట్టి వాగును దాటుతూ స్వాంగి గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని, దీనికి కూడా తమ గ్రామస్తులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు.
ప్రయాణికులకు దూరభారం తగ్గుతుంది
ఈ వంతెన నిర్మిస్తే యాకర్పల్లి, వంజర్, తాండ్ర, వైకుంఠాపూర్, కాంకెట గ్రామాల ప్రజలతో పాటు సారంగాపూర్ నుండి భైంసా, ఆదిలాబాద్ వెళ్లే ప్రయాణికులకు దూరభారం తగ్గుతుందని పేర్కొన్నారు. సమస్యను పరిశీలించి త్వరగా వంతెన మంజూరు చేయాలని కోరారు.
గ్రామస్తుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.