సారంగాపూర్, జులై 13
దుబాయిలో గుండెపోటుతో మృతిచెందిన శివరాత్రి నరసింలు కుటుంబానికి నవభారత్ వెల్ఫేర్ సొసైటీ అండగా నిలిచింది. సొసైటీ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
మండల కేంద్రానికి చెందిన శివరాత్రి నరసింలు దుబాయిలో గుండెపోటుతో మృతిచెందడంతో ఆయన కుటుంబానికి నవభారత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అండగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన సొసైటీ సభ్యులు, తమ ఆధ్వర్యంలో రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు రమేష్ గౌడ్, సభ్యులు బీమలింగం, రమణారావు, మోహన్, ప్రవీణ్ కుమార్, భూమేష్, పోషెట్టి, సురేష్, సైమొద్దీన్, రింకు, రియాజ్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.












