** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా ఉన్న శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని నిర్మల్ జిల్లా యాదవ్ సంఘం డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలను యాదవ సమాజం మొత్తం అవమానించినట్లుగా భావిస్తున్నామని, దీనిని సహించబోమని సంఘం స్పష్టం చేసింది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై అవమానకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను బహిరంగంగా ఉపసంహరించుకుని, శ్రీమతి ఈశ్వరమ్మ యాదవ్ కి మాత్రమే కాకుండా యాదవ సమాజం మొత్తం పట్ల బహిరంగ క్షమాపణ చెప్పాలని నిర్మల్ జిల్లా యాదవ్ సంఘం తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాము.
యాదవ సమాజ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలకు వెంటనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.
తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి, యాదవ సమాజం ఐక్యతను చాటుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఈ మేరకు నిర్మల్ మున్సిపల్ 9వ వార్డ్ కౌన్సిలర్ మంచాల శ్రీకాంత్ యాదవ్ తెలిపారు.












