పోచారం (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 25
పోచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎన్హెచ్ఆర్సీ నగర అధ్యక్షుడు జే. లక్ష్మణ్ తన సొంత నిధులతో 55 జతల షూలను అందజేశారు. నిరుపేద విద్యార్థుల అవసరాలను గుర్తించి ఆయన ఈ సహాయం అందించారు.
పోచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఎన్హెచ్ఆర్సీ నగర అధ్యక్షుడు జే. లక్ష్మణ్ తన సొంత ఖర్చులతో 55 జతల షూలను అందజేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి తన వంతు సహాయంగా షూలను అందించడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సేవాభావాన్ని అభినందించిన ఉపాధ్యాయులు
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు 55 జతల షూలను ఏర్పాటు చేసి అందించిన జే. లక్ష్మణ్ సేవాభావాన్ని అభినందించారు. ఆయన దినదినాభివృద్ధి చెందాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేలా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరారు.











