నిర్మల్, 2023-08-14
నిర్మల్ నియోజకవర్గం సొన్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు () రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళా మత్స్యకారుల భవనాన్ని (మహిళల జీవనోపాధి - ఆర్థిక సాధికారత కేంద్రం) ను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేడు ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటి మహిళల జీవనోపాధి - ఆర్థిక సాధికారత కేంద్రం నిర్మల్ నియోజకవర్గంలో ప్రారంభం కావడం విశేషం.

మత్స్యకార మహిళల సాధికారత
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకార మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
భవనం ఉపయోగాలు
ఈ భవన నిర్మాణం ద్వారా మహిళా మత్స్యకారులకు శిక్షణ, సమావేశాలు మరియు మత్స్య ఉత్పత్తుల నిల్వకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ కేంద్రం ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.