వికారాబాద్, 2026-08-30
ప్రజాస్వామ్యంలో అధికారం, ప్రతిపక్ష హోదా దక్కాలంటే పత్రికల పాత్ర కీలకమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజల గొంతుకగా నిలవడంలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివకేశవ బ్యాంక్ హాల్లో నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ సభ జరిగింది.
ప్రజాస్వామ్యంలో అధికారం, ప్రతిపక్ష హోదా దక్కాలంటే పత్రికల పాత్ర కీలకమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజల గొంతుకగా నిలవడంలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివకేశవ బ్యాంక్ హాల్లో నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ సభ జరిగింది. ముందుగా నవతెలంగాణ వికారాబాద్ ప్రత్యేక సంచికను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్, జీఎం వెంకటేశ్, మొఫిసిల్ ఇన్చార్జి జి.వేణుమాధవరావు, ఇతర నేతలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ నవతెలంగాణ పత్రిక జనశక్తిగా ప్రారంభమై.. ప్రజాశక్తిగా.. ప్రస్తుతం నవతెలంగాణగా కొనసాగుతుంద న్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పని చేస్తూ, సమాజంలోని సమస్య లను ఎప్పటికప్పుడూ ప్రజల దృష్టికి తీసుకురావడం అభినందనీ యమని అన్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, వాటిని వెలుగులోకి తీసుకురావడంలో నవతెలంగాణ తనదైన పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతమైన, బాధ్యతాయుతమైన జర్నలిజం ఎంతో అవసరమనిచెప్పారు. నవతెలంగాణ పత్రికకు శుభాకాంక్షలు తెలిపారు.
మీడియా గొంతు నొక్కితే ప్రజాస్వామ్యం మూగబోతుంది
మీడియా గొంతు నొక్కితే ప్రజాస్వామ్యం మూగబోతుందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రజల గొంతుకగా నిలవడంలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పనిచేస్తూ సమా జంలోని సమస్యలను ఎప్పటికప్పు డూ ప్రజల దృష్టికి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయు తమైన, బాధ్యతాయుతమైన జర్నలిజం ఎంతో అవసరమని అన్నారు. ప్రజల పక్షాన మరింత బలంగా నిలుస్తూ వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ నవతెలంగాణ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమాజంలో పత్రికల ప్రాధాన్యతను వివరించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా పత్రికల్లో వచ్చే వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు చేసే సూచనలను పాటించాలన్నారు. ప్రతిపక్షాలు కూడా సరైన సూచనలు ఇవ్వాలన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణాలు సరికాదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. యువత తలుచుకుంటే. ఎంతటి వారైనా తలవంచక తప్పదని అన్నారు. నవతెలంగాణ పత్రిక దశాబ్ది ఉత్సవాలే కాదు.. శతాబ్ది కాలం పాటు ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి పత్రికను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. మీడియా అంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిన నేటి తరుణంలో ఎవరీ సహకారం లేకుండా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నవతెలంగాణ పత్రిక నిలబడడం గొప్ప విషయం అన్నారు. నవతెలంగాణ పత్రికకు తమ సహకారం ఉంటుందని అన్నారు.












