ప్రజావాణిలో భూముల సంబంధించి ఐదు దరఖాస్తులు : నోడల్ అధికారి శేషగిరి శర్మ
మిర్యాలగూడ ఆగస్టు 24 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ మండలం యందు సోమవారంనిర్వహించిన మండల స్థాయి ప్రజావాణికార్యక్రమంలో మొత్తం ఐదు దరఖాస్తులు వచ్చినాయని ఎంపీడీవో, నోడల్ అధికారి శేషగిరి శర్మ తెలిపారు. రెవెన్యూ భూములకుసంబంధించినవి అని, తహసిల్దారు పరిష్కరించుటకు ఐదు దరఖాస్తులు అందజేశామన్నారు. స్వీకరించినదరఖాస్తులు పరిష్కరించిదరఖాస్తుదారునికితెలియజేయాలని, ఆన్ లైన్ యందు అప్డేట్ చేయాలని నోడల్ అధికారి శేషగిరి శర్మ కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో తహసిల్దార్ పి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజా రెడ్డి, ఎంపీ ఓ రమేష్, మండల వ్యవసాయ అధికారిని రుశేంద్రమణి, వెటర్నరీ అధికారి స్వప్న, మండల విద్యాధికారి ధర్మానాయక్, మండల ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ మోహిద్ అంగన్వాడీసూపర్వైజర్లు, సావిత్రి, సాయిరాములు, తరుణ్ కుమార్, ఎస్ కె వసీమ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ వార్డెన్లు, సైదయ్య సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్, నాగులు హౌసింగ్ ఎఇ, మణిదీప్, సుస్మిత ఎఇ ఆర్డబ్ల్యూఎస్ , ప్రభాకర్ ఎఇ ఇరిగేషన్, అమర్ సింగ్ ఎఇ ఎలక్ట్రిసిటీ, నాగరాజు బీట్ ఆఫీసర్, నిజాముద్దీన్ ఏపిఎం మొదలగు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.












