నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు మార్చి 19న ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సంఘ అభివృద్ధి, సమాజ ఐక్యత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జుట్టు లక్ష్మన్, ఉపాధ్యక్షుడిగా దోనిగామ గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా సట్ల శ్రీనివాస్, కోశాధికారిగా జక్కుల ముత్యం, సంయుక్త కార్యదర్శులుగా మగాం నాగరాజు, మొండి నరేందర్ ఎన్నికయ్యారు.
సలహా సభ్యులుగా గాజుల గజ్జరాం, కుమ్మరి గజేందర్, తాటి మహిపాల్, దొనికేని వెంకటేష్, మానాజీ గారి పోశెట్టి, పీసా గజ్ఞారం, తాటి శివకుమార్, నూతికాడి రాములు ఎంపికయ్యారు.
నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జుట్టు లక్ష్మన్ మాట్లాడుతూ సంఘ సభ్యులు రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.












