నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బీరవెల్లి సాయిబాబా ఆలయం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం, బీరవెల్లి గ్రామానికి చెందిన గాధి గంగాధర్ (55) తన మోపెడ్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మిరియాల గంగారం (17) ద్విచక్ర వాహనంతో ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరి కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పైలెట్ జ్ఞానేశ్వర్ సహాయంతో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు.
అనంతరం, గాయపడిన ఇద్దరిని నిర్మల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.








