సారంగాపూర్, 6 September
మండలం చించోలి (బి) గ్రామంలో రానున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.
చించోలి (బి) గ్రామంలో గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో సమావేశం... నిర్మల్ జిల్లా:- ఈ రోజు నిర్మల్ జిల్లా SP డా. జానకి షర్మిల IPS ఆదేశాల మేరకు మండలం చించోలి (బి) గ్రామంలో రానున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు గణేష్ మండపాల నిర్వాహకులతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్. ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ,గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులకు సూచించడం జరిగింది. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తూ, ప్రభుత్వ నిబంధనలు మరియు పోలీసు శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేయడం జరిగింది. ప్రజలు, నిర్వాహకులు పరస్పర సహకారంతో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా మరియు స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించాలని కోరడం జరిగింది. ఈ సందర్బంగా ప్రతి గణేష్ మండపాల వద్ద కచ్చితంగా CCTV కెమెరా ఏర్పాటు చేసుకొవాలని కోరగా యువత CCTV కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం జరిగింది.. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ పోశెట్టి, VDC సభ్యులు మరియు యువత పాల్గొన్నారు..










