నిర్మల్, 6 September
నిర్మల్ జిల్లా ప్లంబింగ్ టెక్నీషియన్లు తమ నూతన యూనియన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా షేక్ ముదస్సిర్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ రఫీక్, కోశాధికారిగా సయ్యద్ మజీద్లు ఎన్నికయ్యారు.
నిర్మల్: ప్లంబింగ్ టెక్నీషియన్లు తమ నూతన యూనియన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా షేక్ ముదస్సిర్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ రఫీక్, కోశాధికారిగా సయ్యద్ మజీద్లు ఎన్నికయ్యారు.
రేట్ల సవరణపై ప్రకటన
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న పాత రేట్లను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా త్వరలోనే సవరించనున్నట్లు తెలిపారు. నూతన రేట్ల పట్టికను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.












