నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకం కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. గ్రామ సర్పంచ్ ఈర్ల చిన్నయ్య, అధికారుల సమక్షంలో గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది.
ఆలూరు గ్రామంలో లబ్ధిదారు దూదేకుల రంజాని కోసం నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని సర్పంచ్ ఈర్ల చిన్నయ్య, అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లింగయ్య, మండల ప్రత్యేక అధికారి బాలిక్ అహ్మద్, ఎంపీడీవో లక్ష్మీకాంతారావు, హౌసింగ్ ఏఈ నాగార్జున, పంచాయతీ కార్యదర్శి లింగయ్య, జీపీవో రహీమ్ పాషా, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పేదలందరికీ గృహ వసతి కల్పించే దిశగా ఇందిరమ్మ గృహ పథకం అమలు జరుగుతోందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గృహ నిర్మాణ ప్రక్రియలో సహకరించిన అధికారులకు, సిబ్బందికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.












