అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానాయకుడు బాబు జగ్జీవన్ రావ్ అని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత దశరథ నాయక్, సామాజికవేత్త డాక్టర్ రాజు అన్నారు. జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే భవనంలో నిర్వహించిన వేడుకలలో పాల్గొని వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ ఉపప్రధానిగా, దళిత వర్గాల నేతగా జగ్జీవన్ రావ్ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. ఆయన అణగారిన వర్గాల అభివృద్ధికి, సామాజిక న్యాయానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
జగ్జీవన్ రావ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ కోకన్వీనర్లు దాసరాజు జయరాజు, చేగోండి మురళి యాదవ్, పిల్లలమర్రి రవికుమార్, తిరుపతయ్య, జవ్వాజి మహేష్ తదితరులు పాల్గొన్నారు.












