కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ పునఃప్రారంభం

Kaleshwaram Project Commission Inquiry Begins
  • కమిషన్ విచారణ నేటి నుండి ప్రారంభం
  • ఇంజనీర్లు, అధికారుల విచారణ
  • ఫైనల్ రిపోర్ట్ అందజేయాలని విజిలెన్స్ డీజీకి ఆదేశాలు
  • 29వ తేదీ వరకు విచారణ కొనసాగింపు

 

కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ నేటి నుంచి మళ్లీ ప్రారంభమైంది. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనుంది. ఇంజనీర్లు, అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను విచారణకు పిలువనున్నారు. విజిలెన్స్ మరియు ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టులను ఈ నెలాఖరు నాటికి కమిషన్‌కు అందజేయనున్నారు.

 

హైదరాబాద్: అక్టోబర్ 23

కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ నేటి నుండి మళ్లీ పునఃప్రారంభమైంది. ఈ విచారణ రెండు విడతల్లో కొనసాగనుంది. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో సమావేశమై విజిలెన్స్ రిపోర్ట్‌పై వివరణ ఇచ్చారు.

విజిలెన్స్ డీజీకి కమిషన్ లేఖ రాసి ఫైనల్ రిపోర్ట్ అందించాలని ఆదేశించింది. ఈ విచారణలో ఇంజనీర్లు, రిటైర్డు ఇంజనీర్లు, బ్యూరోక్రాట్లు మరియు ఇతర ఉన్నతాధికారులను విచారణకు పిలువనుంది. ఈ నెల 29 వరకు ఈ విచారణ కొనసాగనుంది.

బీఆర్ఎస్ నేత వి. ప్రకాష్ వంటి ప్రజాప్రతినిధులను బహిరంగ విచారణకు పిలిపించనున్నారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ మరియు కాగ్ అధికారులు కూడా విచారణలో భాగమవుతారు.

Join WhatsApp

Join Now

Leave a Comment