ఖమ్మం వరద బాధితులకు సహాయార్థం విరాళాల సేకరణ

Alt Name: ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్న అష్ట
  1. ఖమ్మం వరద బాధితులకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కళాకారుల సంఘం సహాయం
  2. విరాళాలు సేకరించేందుకు ప్రజాగాయకుడు అష్ట దిగంబర్ ప్రకటన
  3. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలకు సహాయం చేయాలని పిలుపు
  4. విరాళాలు సీఎం సహాయనిధికి పంపనున్నారు

 Alt Name: ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్న అష్ట

: ఖమ్మం జిల్లాలోని వరద బాధితుల సహాయార్థం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తున్నారు. ప్రజాగాయకుడు అష్ట దిగంబర్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల నుంచి ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు సహాయం చేయాలని కోరారు. సేకరించిన విరాళాలను సీఎం సహాయనిధికి పంపనున్నారు.

: ఖమ్మం జిల్లాలో వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల సహాయార్థం, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం విరాళాలు సేకరిస్తున్నట్లు ప్రజాగాయకుడు అష్ట దిగంబర్ తెలిపారు. ప్రకృతి బీభత్సానికి గురై ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాను ఎన్నుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు దాతలుగా ముందుకు రావాలని అష్ట పిలుపునిచ్చారు. సేకరించిన విరాళాలు తెలంగాణ నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో సీఎం సహాయనిధికి పంపుతామని తెలిపారు.

దాతలు తమ సహాయాన్ని 9848493481 అనే నంబర్‌కు పంపవచ్చని, వారి సాహాయ్యంతో బాధితులకు ఆహారాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు కళాకారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment