విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు: సీఎం రేవంత్ రెడ్డి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
  • పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహణ
  • విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం
  • పోలీస్ ఉద్యోగులకు ర్యాంక్ ప్రాతిపదికన పరిహారం ప్రకటన
  • యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం
  • పోలీస్ శాఖకు ప్రభుత్వం అండ

 

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ వరకు ర్యాంక్ ప్రాతిపదికన నష్ట పరిహారం ఇస్తామని, పోలీస్ కుటుంబాలు గౌరవంగా బతికేలా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పునాది వేయడం వంటి కీలక ప్రకటనలు చేశారు.

 

హైదరాబాద్, అక్టోబర్ 21

: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్‌లకు కోటి రూపాయల పరిహారం ఇవ్వడం మొదలుకుని, ర్యాంక్ ఆధారంగా సబ్ ఇన్స్పెక్టర్లు మరియు ఇన్స్పెక్టర్లు కోటి 25 లక్షలు, డీఎస్పీ మరియు ఎస్పీ లకు కోటి 50 లక్షలు, ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్ల వరకు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు ర్యాంక్‌ను అనుసరించి 50 లక్షల పరిహారం ఇవ్వనున్నారని పేర్కొన్నారు.

అదనంగా, మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించారు. అలాగే, పోలీస్ కుటుంబాల కోసం యంగ్ ఇండియా స్కూల్‌ను ప్రారంభించడం జరిగింది, ఈ స్కూల్ 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతుందని తెలిపారు. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, పోలీసులు బాధితులతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రేహౌండ్ అమర వీరుడు ప్రవీణ్ జూనియర్ కమాండర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించడం మన బాధ్యత అని చెప్పారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 214 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, తెలంగాణ రాష్ట్రం నుండి 1 పోలీస్ అధికారి అమరుడయ్యారని వివరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment