పశువుల అక్రమ రవాణా అంతరాష్ట్ర ముఠా పట్టివేత
మత్తు ఇంజెక్షన్లతో గోవులను కబళించిన గ్యాంగ్
చెక్ పెట్టిన నిర్మల్ జిల్లా పోలీసులు
జిల్లా ఎస్పీ జానకి షర్మిల
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 14
గత కొన్ని నెలలుగా నిర్మల్ జిల్లా మరియు పరిసర జిల్లాలలో పశువులకు మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ చోరీకి పాల్పడుతూ వధిస్తున్న ఒక అంతరాష్ట్ర ముఠాను నిర్మల్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఈ ముఠా నాయకుడు నాందేడ్ కి చెందిన సయ్యద్ సోహెల్. ఇతను దాదాపు 40 మందిని ఏర్పాటు చేసుకొని ఇన్నోవా బోలేరో వాహనాలను పశువుల అక్రమ రవాణాకి అనుకూలంగా వెనుక సీట్లను తీసి వేయడానికి నాందేడ్ లో పెద్ద గ్యారేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్లందరూ కూడా ఒక ముఠా గా ఏర్పడి గోవులకు, ఎద్దులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి వాటిని చోరీ చేసి, వధించి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మాంసాన్ని విక్రయించేవారు. మత్తు ఇంజెక్షన్లు భైంసా కు చెందిన ఖలీద్ వీరికి సప్లయ్ చేసే వాడు. ఈ ముఠా గోవులను చోరీ చేసేందుకు ఒక వాహనంలో ముధోల్ కు రావడం జరిగింది. దీన్ని సిసి కెమెరాల ద్వారా గుర్తించి, ఒకర్ని పట్టుకుని ఇది వరకే రిమాండ్ కు తరలించడం జరిగింది. ఇంకా మిగతా నిందితులను త్వరగా పట్టుకోవాలనే లక్ష్యంతో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పి భైంసా అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది.ధినిలో అనేక మంది సి ఐ లు,ఎస్ ఐ లు పాల్గొన్నారు. నిర్మల్ పోలీసులు తమకోసం వెతుకుతున్నారని తెలియగానే ఈ బృందం రెండు కార్లలో అజ్మీర్ కు పరారీ అయ్యింది. ఈ బృందం మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా వద్ద ఈ ఏడుగురి నిందితులను పట్టుకోవటం జరిగింది. ఈ పట్టుకోవడంలో నిర్మల్ ఏఎస్పీ రాజేష్ కుమార్ ముఖ్యపాత్ర వహించారు. రాజస్థాన్ పోలీసుల సహాయంతో వారిని అజ్మీర్లో పట్టుకొని తీసుకొని రావడం జరిగింది. బైంసాకు చెందిన షేక్ ఉమెర్ వీరికి ప్రధానంగా సహకరిస్తున్నట్లు గుర్తించారు. అతనిని, ఖులీద్ ను కూడా బైంసాలో అరెస్టు చేయడం జరిగింది. నాందేడ్ కు చెందిన రాజు, బైంసాకు చెందిన తయూబ్ పరారీలో ఉండగా మిగిలిన నిందితులను అందరిని అరెస్టు చేయడం జరిగింది. నిందితుల నుండి స్వాధీన పరుచుకున్న వస్తువులు మహీంద్రా, డిజైర్ కారు, మొత్తం 8 మొబైల్ ఫోన్లు –39,280 రూపాయల నగదు నిర్మల్ కి సంబంధించినంత వరకు ముధోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సర కాలంగా పశువులను దొంగలిస్తూ రైతులకు నష్టం కలిగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పశువులు-గోవుల అక్రమ రవాణా చట్టరీత్యా నేరం, ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు.వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది, దీనిలో ఇంకా కొంతమంది ఉన్నట్లు గుర్తించాం, వారిని కూడా వెతికి అతి తొందరగా పట్టుకుని రిమాండ్ కి పంపుతామని తెలిపారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం రాత్రింబవళ్ళు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాము. అంతరాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టులు, సమాచారం ఆధారంగా రైడ్లు, మరియు సరిహద్దు ప్రాంతాల్లో కఠిన నిఘాను అమలు చేస్తున్నాం. అక్రమ రవాణాలో పాల్గొనేవారికి హెచ్చరిక చట్టం ముందు ఎవ్వరూ తప్పించుకోలేరు. కేసులు నమోదు చేసి, కోర్టులో కఠిన శిక్షలు పొందేలా చేస్తాం. అలాగే ప్రజల సహకారం కూడా చాలా అవసరం. గోవుల అక్రమ రవాణా జరిగితే వెంటనే 100 నంబర్ కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. మీ పేరు, వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.ఈ కేసు ను ఛేదించడంలో చాకచక్యంగా పాల్గొన్న భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన, ముధోల్ సీఐ జి. మల్లేష్, సిఐ ముధోల్, ఎస్‌బి ఇన్స్పెక్టర్ సమ్మయ్య, సిఐ భైంసా రూరల్ ఎం నైలు, ఎస్‌ఐ భైంసా రూరల్ శంకర్, ఎస్‌ఐ ముధోల్ బిట్ల పెర్సిస్, ఎస్ఐ తానూర్ జుబేర్, కానిస్టేబుల్స్ జె.జయవంత్ రావు, బి. ప్రమోద్ కుమార్, ఏ.లస్మన్న, కె.సందీప్ కుమార్, సి.సతీష్ రెడ్డిలను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ప్రశంసించారు. నిందితులను 1.సయ్యద్ సోహెల్ (40), 2.షేక్ జమీర్ (27), 3.షేక్ ముర్తుజా (36), 4.మొహమ్మద్ నసీర్ (35), 5.సయ్యద్ అక్ఱం (24), 6.సయ్యద్ షోయబ్ (33), 7.సయ్యద్ ఫైజాన్ (23), 8. షేక్ ఉమెర్(భైంసా), 9. ఖలిద్ (భైంసా) అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.