సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు చేసిన వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు చేశాడని టూటౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. పోలీసులు కొడుతున్నట్లుగా ఉన్న వీడియో ఆదిలాబాద్‌కు చెందింది కాదని, దీనివల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, అతని వద్ద నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకొని సోమవారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు