ఆర్మూర్, జూలై 16
ఆర్మూర్ లో నూతన పట్టు చేనేత సహకార సంఘం చైర్మన్ గా గంగా మోహన్ చక్రు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిరాయత్ నగర్ హనుమాన్ మందిర కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన చైర్మన్, సెక్రటరీ, డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ గంగా మోహన్ చక్రు తెలిపారు.
ఆర్మూర్: నూతన పట్టు చేనేత సహకార సంఘం చైర్మన్ గా గంగా మోహన్ చక్రు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిరాయత్ నగర్ హనుమాన్ మందిర కమిటీ అధ్యక్షులు అంబల్ల తిరుపతి, కార్యదర్శి నూకల శేఖర్, కోశాధికారి నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ గంగా మోహన్ చక్రు, సెక్రటరీ బొచ్కార్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్లుగా ఎన్నికైన ఖాందేశ్ సత్యం, వంగ ఆనంద్ కృష్ణ లకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా గంగా మోహన్ చక్రు మాట్లాడుతూ, పట్టు చేనేత సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, నేత పనివారికి ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రూపాలి నర్సయ్య, కోలు దత్తద్రి, విట్టోబ శేఖర్, స్వామి యాదవ్, మానకొండూర్ భాస్కర్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












