నేడు మిర్యాలగూడలో బండారు రైస్ మిల్ ప్రారంభోత్సవం : మేనేజింగ్ డైరెక్టర్ బండారు కుశలయ్య
మిర్యాలగూడ జులై 3 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణ శివారు ఈ నెల 4 (శనివారం) ఉదయం 11 గంటలకు బండారు ఆగ్రో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బండారు నూతన రైస్ మిల్ ప్రారంభోత్సవం కానుందని మేనేజింగ్ డైరెక్టర్స్ బండారు కుశలయ్య, బండారు వెంకన్న,బండారు సతీష్ లు తెలిపారు. ఈ సందర్భంగా కుశలయ్య మాట్లాడుతూ ప్రకృతికి దగ్గరగా నాణ్యతకు నిబద్ధతగా బండారు రైస్ మిల్ ను ఇరిగేషన్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి,మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, తోపాటు మాజీ మంత్రులు, ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, రైస్ మిల్లర్స్ రాష్ట్ర అధ్యక్షులు గంప నాగేందర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి, మిర్యాలగూడ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ లు హాజరుకానున్నారని డాక్టర్ బండారు కుశలయ్య తెలిపారు.












