గువాహటి (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
అస్సాంలో దేశంలోనే తొలిసారిగా మాచా టీ ఉత్పత్తి చేయబడింది. గువాహటిలో జరిగిన వేలంలో ఈ టీ పౌడర్ కిలో రూ.3,000 ధర పలకడం విశేషం. ప్రకాశవంతమైన గ్రీన్ కలర్, ఉమామి ఫ్లేవర్‌తో ఉండే ఈ ప్రీమియం టీకి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.
దేశంలోనే తొలిసారిగా అస్సాంలో మాచా టీని ఉత్పత్తి చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. చైనా, జపాన్లలో లభించే ఈ టీ పౌడర్, గువాహటిలో జరిగిన వేలంలో కిలో రూ.3,000 పలికింది. ప్రకాశవంతమైన గ్రీన్ కలర్, ఉమామి ఫ్లేవర్‌తో ఉండే ఈ ప్రీమియం టీ పౌడర్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇండియా, జపాన్ మధ్య పదేళ్ల సహకారంతో ఇది సాధ్యమైందని సీఎం తెలిపారు. మాచా టీతో అస్సాం టీ బ్రాండ్‌కు గ్లోబల్ పాపులారిటీ వస్తుందని ఆయన అన్నారు.












