ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లంచం – ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లంచం – ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లంచం – ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

మనోరంజని ప్రతినిధి, మంచిర్యాల | సెప్టెంబర్ 03

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో అవినీతి కేసు వెలుగుచూసింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం గ్రామ కార్యదర్శి వెంకటస్వామి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

బాధితులు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ను వేసి కార్యదర్శిని పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

స్థానిక ప్రజలు ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు ఎటువంటి అవినీతి అడ్డంకులు లేకుండా చేరాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment