BIG NEWS — డీసీపీ చైతన్య ధైర్యం!
హైదరాబాద్: సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకునే ప్రయత్నంలో డీసీపీ చైతన్య అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు.
సమాచారం ప్రకారం, దొంగను అదుపులోకి తీసుకునే క్రమంలో డీసీపీ చైతన్యపై దొంగ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే చైతన్య ప్రతిస్పందించి, తన గన్‌మన్ కిందపడిన నేపథ్యంలో ఆయుధాన్ని స్వయంగా తీసుకుని, దొంగపై మూడు రౌండ్ల వరకు కాల్పులు జరిపారు.
తీవ్రంగా జరిగిన ఈ ఘటనలో చైన్ స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సెల్ ఫోన్ స్నాచర్‌పై తక్షణ చర్య తీసుకోవడం ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడిన డీసీపీ చైతన్యను పోలీసులు మరియు స్థానికులు అభినందిస్తున్నారు.
—