కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టినందున లబ్ధిదారులు
గిరుకల మహేశ్వరి మల్లేశం ఇంట్లో సహా పంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్న
రాష్ట్ర ఫిషర్ మెన్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి
జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుహాసిన్ రెడ్డి
జిల్లా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త హనుమన్న గారి నరేందర్ రెడ్డి
మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట్ ఏప్రిల్ 15
పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర నిరుపేదలకు పెద్ద అన్నయ్యగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్నటువంటి నిరుపేద అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఫిషర్మెంట్ మెట్టు సాయికుమార్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి అన్నారు. వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామానికి చెందిన గిరుకెల మహేశ్వరి మల్లేశం, దంపతుల నివాసంలో సన్న బియ్యంతో తయారుచేసిన భోజనం చేసి అన్నదాత సుఖీభవ అంటూ వారు వారికి దంపతులకు కలకాలం సుఖశాంతులతో ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు నిరుపేదలకు సన్నబియ్యం అందించడం తద్యమని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా, కొత్త పథకాలను అమలు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తుందని అన్నారు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగ ఎల్లవేళలా ఉంటుందని వారు తెలిపారు. సన్న బియ్యంతో నిరుపేదలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ సుహాసిని రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుతూ సన్నబియ్యంతో పేదల ఆకలి తీర్చే సంక్షేమ పథకాలతో సమ్మున్నతంగా నిలిపి అందలేని ఎత్తులను చేరే మెట్ల దారులు నిర్మిస్తూ పొందలేము అనుకున్నా లక్ష్యాలకు రాచ బాటలేస్తున్న అసాధ్యమనుకొన్న సుసాధ్యం చేస్తూ అందరి ఆశలు తీరే అవకాశాలు కల్పిస్తూ వెనుకబడిన వారిని ముందుకు నడిపించేందుకు ఎన్నెన్నో ప్రజా యోధక పథకాలతో వడివడిగా అడుగు వేస్తూ కదులుతున్న ప్రజా ప్రభుత్వ పాలన లక్ష్యం ప్రజా పంపిణీ వ్యవస్థ పునరాజ్ఞవనం బడుగు బలహీన వర్గాలకేది ఆలంబన ప్రజా పాలనకు ఉంటుంది ప్రజలందరికీ ఇదే దీవెన అని ఆమె స్వయంగా రాసిన కవిత వివరాలను కార్యకర్తల ముందు వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీ స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా గ్రంధాలయ బోర్డ్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, వెల్దుర్తి కాంగ్రెస్ పార్టీ మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, ముక్తా బాయ్ పలు గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అందుగులపల్లి శ్రీనివాస్ ఉప్పు లింగాపూర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు