గ్రామాల్లో బతుకమ్మ పండుగ సందడి
ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 25
మండల కేంద్రమైన ముధోల్తోపాటు వివిధ గ్రామాల్లో బతుకమ్మ పండుగ సందడి నెలకొంది. మహిళలు, యువతులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను అలంకరించి గౌరమ్మను పూజించారు. మహిళలు, చిన్నారులు బతుకమ్మను అలంకరించి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. సాంప్రదాయక వస్త్రాలు ధరించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగ ఉత్సవాలను జరుపుకుంటారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బతుకమ్మ పండుగ సందడి కనిపిస్తుంది.