- బోసి గ్రామ శ్రీ మహాదేవ్ ఆలయంలో కర్ర వరసిద్ధి వినాయకుని దర్శనం
- బైంసా హిందు ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు
- ఆలయ కమిటీ సభ్యులు హిందు ఉత్సవ సమితి సబ్యులను సన్మానించారు
- స్వామివారి చిత్రపటం జ్ఞాపకంగా బహుకరించారు
: నిర్మల్ జిల్లా బోసి గ్రామంలోని శ్రీ మహాదేవ్ ఆలయంలో కొలువుదీరిన కర్ర వరసిద్ధి వినాయకుని బైంసా హిందు ఉత్సవ సమితి సభ్యులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ కమిటీ సభ్యులు హిందు ఉత్సవ సమితి సభ్యులను సన్మానించారు. జ్ఞాపకార్థం స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.
: నిర్మల్ జిల్లా తానుర్ మండలం బోసి గ్రామంలో వెలసిన శ్రీ మహాదేవ్ ఆలయంలో కొలువుదీరిన కర్ర వరసిద్ధి వినాయకుని శనివారం బైంసా హిందు ఉత్సవ సమితి సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హిందు ఉత్సవ సమితి సభ్యులను సన్మానించి, జ్ఞాపకార్థంగా స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో హిందు ఉత్సవ సమితి అధ్యక్షులు పెండెపు కాశినాథ్, పురస్తు గోపాల్, గోపాల్ సూత్రావే, కౌన్సిలర్ షిందే కపిల్ పటేల్, వరసిద్ధి కర్ర వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బూసి మురళి, గౌరవ అధ్యక్షుడు పసుల నాగనాథ్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.