సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 26
ముధోల్ మండలం విట్టోలి తండాలో మంగళవారం రాత్రి సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్బిఐ బ్యాంక్ సిబ్బందితో కలిసి సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అపరిచిత వ్యక్తులకు తమ వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్ వస్తే పోలీస్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఇతర వివరాలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వద్దని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా ప్రజల సమాచారాన్ని సేకరించి బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఖాళీ చేస్తున్నారన్నారు. ఫోన్ లోకి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దన్నారు. ప్రజలు 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రజలకు పలు వివరాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, యువకులు, ఎస్బిఐ బ్యాంక్ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు