పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి

పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి

పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి

దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

వివరాలు వెల్లడించిన బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్

కుబీర్/ బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 19

పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి

కుబీర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఉన్మాది పట్టుబడ్డాడు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో దాడి జరిపి పారిపోయిన ఉన్మాదిని అక్కడి పోలీసులు జల్లెడ పట్టి అర్ధరాత్రి వేళ పట్టుకొని అరెస్టు చేశారు. శుక్రవారం బైంసాలో ఏఎస్పీ అవినాష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి సంఘటన వివరాలు తెలిపారు. ఏఎస్పీ తెలిపిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ కలీమ్ (51) అనే వ్యక్తి కుబీర్ మండల కేంద్రంలోని తన అత్తగారి ఇంటికి మూడు రోజుల క్రితం వచ్చాడు. గురువారం కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. దీంతో భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని తెలిపింది. కేసు పెడతానని హెచ్చరించింది. అప్పటికే మత్తులోనున్న అబ్దుల్ కలీం తానే పోలీస్ స్టేషన్ వెళ్లి వాళ్ల సంగతి చూస్తానంటూ పేర్కొంటూ ఇంటి నుంచి పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. అక్కడికి వెళ్లి సైకో తీరుతో వ్యవహరిస్తున్న అబ్దుల్ కలీమ్ పరిస్థితిని గమనించిన డ్యూటీలోని హెడ్ కానిస్టేబుల్ నారాయణ అతనిని ఎందుకు వచ్చావ్ అంటూ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లోపల వచ్చేందుకు యత్నించిన ఉన్మాదిని ఆయన నిలువరించే ప్రయత్నం చేసాడు. ఇదే సమయములో ఉన్మాది తన వెంట తీసుకువచ్చిన కత్తితో హెడ్ కానిస్టేబుల్ నారాయణపై దాడికి పాల్పడ్డాడు. అప్పటికే పోలీసు స్టేషన్ లో ఉన్న హోంగార్డు గిరి హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన ఉన్మాదిని అడ్డుకునేందుకు యత్నించగా ఆయనపై సైతం దాడికి దిగాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న ఇతర పోలీసు సిబ్బంది క్షతగాత్రులను వైద్య సేవల నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఉన్మాదిని పట్టుకునేందుకు బైంసా రూరల్ సీఐ నైలు, ఎస్ఐ కృష్ణారెడ్డిలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పంట చేనులో దాక్కున్న ఉన్మాది అబ్దుల్ కలీమ్ ను పట్టుకొని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీన పరుచుకున్నారు. విధి నిర్వాహణలోనున్న పోలీసుల పై దాడికి పాల్పడిన నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడుతామని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో భైంసా టౌన్ సీఐ గోపినాథ్, రూరల్ సీఐ నైలు, ముధోల్ సీఐ జి.మల్లేష్, కుభీర్ ఎస్ఐ కృష్ణారెడ్డిలు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment