వికారాబాద్ జిల్లాలో దారుణం
భార్య, కూతురు సహా ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో కుటుంబ కలహాల కారణంగా ఆదివారం ఉదయం వేపురి యాదయ్య అనే వ్యక్తి తన భార్య అలివేలు (31), ఇద్దరు కూతుర్లు అపర్ణ (13), శ్రావణి (10), వదిన హనుమమ్మ (40) మీద కత్తితో దాడి చేసి అనంతరం తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
దాడిలో పెద్ద కూతురు అపర్ణ తప్పించుకోగా మిగతా ముగ్గురు మరణించారు. అపర్ణ స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది