వైన్ షాపుల్లో దొంగతనం చేసిన నిందితుల అరెస్ట్
ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 11
ముధోల్-తానూర్ మండల కేంద్రాలలోని వైన్సు షాపులలో చోరీలకు పాల్పడ్డ దుండగులను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. శనివారం భైంసా పట్టణంలోని ఎస్డిపిఓ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్ బిలోలీ గ్రామానికి చెందిన ఆరుగురు దుండగులు ముధోల్ కేంద్రంలోని రాజరాజేశ్వరి వైన్ షాప్ లో రూ.2.50లక్షలు, తానూర్ కేంద్రంలోని శ్రీలక్ష్మి వైన్ షాపులో దాదాపు రూ.80 వేలను చోరీ చేశారన్నారు. అంతేకాకుండా వైన్ షాప్ లోని మద్యం బాటిల్స్ ను తీసుకెళ్లి రెంజల్ మండలంలోని బెల్ట్ షాపులలో విక్రయించారన్నారు. ముధోల్, తానుర్ ఎస్ హెచ్ ఓలు టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో దుండగులను పట్టుకున్నారన్నారు. దుండగులు దుకాణాల్లోని సీసీటీవీ కెమెరాలు గమనించి డివిఆర్లను దొంగిలించి బాసర గోదావరి లో పడేసారన్నారు. ఈ సమావేశంలో ముధోల్ సీఐ జి. మల్లేష్, ఎస్ఐ బిట్ల పెర్సిస్, తానుర్ ఎస్ఐ జుబేర్, తదితరులు పాల్గొన్నారు.