- ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కొత్త మండల కమిటీని ఏర్పాటు.
- పవార్ అంబదాస్ అధ్యక్షుడిగా ఎన్నిక.
- సమితి సభ్యులను ఘనంగా సత్కరించారు.
ముధోల్ మండలంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. పవార్ అంబదాస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల కమిటీలు, బౌద్ధ మహాసభ, భీమ్ ఆర్మీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులను పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
M4 న్యూస్ ప్రతినిధి: ముధోల్:
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మండల నూతన కమిటీని గురువారం బౌద్ధ విహార్ లో నిర్వహించిన సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ, మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శంకర్ చంద్రే అధ్యక్షత వహించారు.
సమావేశంలో మండల కమిటీకి పలు కీలక పదవులు ఏర్పాటు చేయగా, పవార్ అంబదాస్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా భద్రే సాయినాథ్, ఉపాధ్యక్షులుగా వాగ్మారే గంగాధర్, బాన్సుడే గంగాధర్, లోకండే నాగోరావ్, మద్నూరే గంగాధర్, జనరల్ సెక్రటరీగా దయానంద్, జాయింట్ సెక్రటరీలుగా సాయినాథ్, షేశే రావ్, ట్రెజరీగా నాగేష్, జాయింట్ ట్రెజరీగా భీమ్ రావ్ ని ఎన్నిక చేశారు.
ఈ సందర్బంగా, నూతన అధ్యక్షుడు పవార్ అంబదాస్ మరియు కమిటీ సభ్యులను పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం, మండల కమిటీలు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, భారతీయ బౌద్ధ మహాసభ, భీమ్ ఆర్మీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.