చత్తీస్ ఘడ్ లో మళ్లీ భారీ ఎన్ కౌంటర్
మనోరంజని ప్రతినిధి
హైదరాబాద్: జనవరి 21
ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లి పోయింది. ఈరోజు తెల్లవారుజామున భద్రతా బలగాలకు.. మావోయిస్టు లకు మధ్య జరిగిన కాల్పు ల్లో 12 మంది మావోయి స్టులు చనిపోయినట్టు తెలుస్తుంది.
భీకర కాల్పుల తర్వాత భద్రతా బలగాలు గాలిం చగా 12 మంది మావోల మృతదేహాలు దొరికాయి. అయితే, గరియాబాద్ డీఆర్ జీ, ఒడిశా ఎస్ ఓజీ దళాలు కూంబింగ్ ఆపరే షన్ లో పాల్గొన్నాయి. మరణించిన మావోయిస్టు లను గుర్తించే పనిలో భద్రతా సిబ్బంది ఉంది.
అయితే, చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడగా.. అతడ్ని చికిత్స కోసం హెలికాపర్ట్ లో రాయపూర్ కు తరలించారు.
గాయపడ్డ జవానును ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని, పోలీస్ అధికారులు తెలిపారు.మరోవైపు ఇంకా మావోల కోసం సెర్చ్ ఆప రేషన్ కొనసాగిస్తున్నారు.
కాగా, ఈ ఏడాదిలో గరియాబంద్ జిల్లాలో ఇది రెండో ఎన్‌కౌంటర్. ఇప్పటి వరకు మావోయిస్టుల మరణాల సంఖ్య 28కి చేరుకుంది. గతేడాది వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోలు చనిపోయారు