ఇప్పపువ్వు లడ్డుతో రక్తహీనతను అరికట్టవచ్చు: చిరు ధాన్యాలపై దృష్టి సారించాలి –

 

ఇప్పపువ్వు లడ్డుతో రక్తహీనతను అరికట్టవచ్చు: చిరు ధాన్యాలపై దృష్టి సారించాలి – సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి

వెడ్మ బొజ్జు పటేల్, సీతక్క గిరిజన పోషణ

  • ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మంత్రి సీతక్కతో కలిసి గిరిజన పోషణ మిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • రక్తహీనత నివారణకు ఇప్పపువ్వు లడ్డూ పంపిణీ చేయాలని సూచన.
  • సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని రైతులకు పిలుపు.
  • గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించాలన్న అభ్యర్థన.

ఉట్నూర్ మండలంలో గిరిజన పోషణ మిత్ర కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలసి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. రక్తహీనత నివారణకు ఇప్పపువ్వు లడ్డూ పంపిణీ చేయాలని, చిరు ధాన్యాల ఉత్పత్తిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించి, వాణిజ్య పంటలపై మొగ్గు చూపకుండా ఉండాలని సూచించారు.

ఉట్నూర్, సెప్టెంబర్ 22:

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలలో రక్తహీనత సమస్య పెరుగుతున్న నేపథ్యంలో గిరిజన పోషణ మిత్ర కార్యక్రమాన్ని ఐటిడిఏ ఆధ్వర్యంలో ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరయ్యారు.

వెడ్మ బొజ్జు పటేల్, సీతక్క గిరిజన పోషణ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, రక్తహీనత సమస్యను అరికట్టేందుకు, రాష్ట్ర ప్రభుత్వం పోషకాహారం అందించే చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇప్పపువ్వు లడ్డూలు రక్తహీనతతో బాధపడే వారికి మంచి ఔషధ గుణాలను కలిగిన ఆహారం కావడంతో వీటిని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాలని సూచించారు.

వెడ్మ బొజ్జు పటేల్, సీతక్క గిరిజన పోషణ

ఇక చిరు ధాన్యాల ఉత్పత్తి, వాణిజ్య పంటలపై మొగ్గు చూపకుండా, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని పటేల్ అన్నారు. రసాయన ఎరువుల వాడకం భూసారాన్ని తగ్గించటంతో సేంద్రియ ఎరువుల వాడకం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలని, నాసిరకం ఆహారం సరఫరా చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండేవిట్టల్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటిడిఏ పిఓ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment