గుర్తుతెలియని మహిళ బస్టాండ్‌లో పాపను వదిలి వెళ్లిన ఘటన

కదిరి బస్టాండ్‌లో వదిలివెళ్లిన పాప
  • సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్‌లో పాపను వదిలి వెళ్లిన మహిళ
  • ఆరు-ఏడు నెలల చిన్నారిని బస్‌స్టాండ్‌లో వదిలివెళ్లిన ఘటన
  • సీసీ కెమెరాలో మహిళ బస్టాండ్ ప్రాంగణంలో కనిపించినట్టు గుర్తింపు
  • పోలీసుల ఆరా, ఐసీడీఎస్‌ అధికారులకు పాపను అప్పగింపు

 సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్‌లో గుర్తుతెలియని మహిళ ఆరు-ఏడు నెలల పాపను వదిలి వెళ్లింది. సీసీ కెమెరాలో మహిళ బస్టాండ్ ప్రాంగణంలో పాపతో కనిపించినట్టు గుర్తించారు. పోలీసులు పాపను స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

: సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్‌లో ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని మహిళ ఒక ఆరు-ఏడు నెలల పాపను వదిలి వెళ్లిన విషాదకర ఘటన వెలుగు చూసింది. సీసీ ఫుటేజీ పరిశీలనలో ఆ మహిళ బస్టాండ్ ప్రాంగణంలో పాపతో కనిపించినట్టు అధికారులు తెలిపారు. బాత్‌రూమ్‌కు వెళ్ళి వస్తానని చెప్పి పాపను పక్కన కూర్చున్న మహిళకు అప్పగించి వెళ్లినట్లు తెలిసింది. తిరిగి రాకపోవడంతో పాపను స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కదిరి టౌన్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఆ మహిళ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment