కొడుకులకు భారం కాకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య
తెలంగాణ : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం బోట్య తండా పంచాయతీలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు, భూక్య లచ్చు (65), వీరమ్మ (60) తమ కొడుకులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ఆదివారం రాత్రి ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే వీరమ్మ మృతి చెందింది. లచ్చును ఆసుపత్రికి తరలించగా సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు