మిర్యాలగూడ, జూలై 5
ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేసే రైస్ మిల్లర్లకు ఎక్స్ పోర్ట్ ఇన్సెంటివ్ ద్వారా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ శివారులో బండారు ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన రైస్ మిల్లును ఆయన ప్రారంభించారు.
ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేసే రైస్ మిల్లర్లకు ఎక్స్ పోర్ట్ ఇన్సెంటివ్ ద్వారా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.
శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ శివారులో మేనేజింగ్ డైరెక్టర్ బండారు కుశలయ్య ఆధ్వర్యంలో నిర్మించిన బండారు ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన రైస్ మిల్లును ఆయన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్), ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి ఈ విషయాలు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం నిల్వచేసేందుకు ఆధునిక సైలోస్ నిర్మించి, మహిళా సంఘాల ద్వారా నిర్వహణ చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. రైస్ మిల్లులు, గోదాముల ఆధునికరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, రైస్ మిల్లుల వల్ల రైతులకు మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ఎల్ నీనో ప్రభావం ఉందని, వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని రైతులకు ఆయన సలహా ఇచ్చారు. కస్టమ్ రైస్ మిల్లింగ్ (సిఎంఆర్) లోని లోపాలు సరిదిద్దనున్నట్టు, మిల్లర్లు సకాలంలో సిఎంఆర్ బియ్యం చెల్లిస్తున్నారని తెలిపారు.
రబీలో 81 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసి 19,300 కోట్ల రూపాయలు చెల్లించామని, వానాకాలం, రబీ సీజన్లలో కలిపి 150 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో రెండేళ్లలోపు ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
150 కోట్లతో ఆధునిక రైస్ మిల్లు నిర్మించిన బండారు కుశలయ్యను మంత్రి అభినందించారు. రైస్ మిల్లులు రైతు సంక్షేమంగా ఉంటేనే అవి క్షేమంగా అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రైతుల ధాన్యం కొనుగోలులో ఎన్నడూ లేని విధంగా కృషి చేశారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రశంసించారు. మిల్లుల వల్ల రైతుకు మేలు జరగాలని, ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనాలని ఎమ్మెల్సీ కె.శంకర్ నాయక్ సూచించారు.
మిర్యాలగూడ డివిజన్ వేములపల్లి మండలం శెట్టిపపాలం గ్రామ శివారులో బండారు ఆగ్రో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ రైస్ మిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, సివిల్ సప్లై డిఎం రాంపతి, డిసీసీ పున్నా కైలాష్ నేత, మునిసిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, యాదగిరిగుట్ట దేవస్థానం డైరెక్టర్ గుండా మల్లయ్య, బండారు రైస్ మిల్ మేనేజింగ్ పార్ట్ నర్ లు బండారు వెంకన్న, బండారు సతీష్, ఆలిండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్ణాటి రమేష్, కర్నాటి లక్ష్మీనారాయణ, మిర్యాలగూడ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోళ్ళ రామ శేఖర్, కార్యదర్శి పోలిశెట్టి ధనుంజయ, సంతోష్ రెడ్డి, మాశెట్టి శ్రీనివాస్, అల్లాని రమేష్, ప్రసాద్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్, నల్గొండ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.









