విత్తన మేళా...తక్కువ నీటి అవసరమున్న పప్పుధాన్య పంటల విత్తనాలు ప్రదర్శన
మిర్యాలగూడ జూలై 27 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ రైతు వేదికలో మిర్యాలగూడ వ్యవసాయశాఖ, టిజి విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల పరిషత్ ఆవరణలోని రైతువేదికలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్బంగా మిర్యాలగూడ డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
ప్రస్తుత ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షపాతం అనిశ్చితంగా ఉండటంతో రైతులు వరి సాగుపై సందిగ్ధంలో ఉన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తక్కువ నీటి అవసరమున్న పప్పుధాన్య పంటల విత్తనాలు ప్రదర్శించామన్నారు
కంది, పెసర, మినుము, ఉలవలు, అలసంద, కూరగాయల విత్తనాలు తదితర పప్పుధాన్యాల విత్తనాలతో పాటు రైతులు కోరే ఇతర పంటల విత్తనాలను కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు రైతు వేదికలో విక్రయించాలన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచి, విత్తన మేళా ఏర్పాటు చేసామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం.ఋష్యేంద్రమణి, టిజి విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ కృష్ణవేణి, వ్యవసాయ విస్తరణ అధికారులు అఫ్రిన్,రమేష్, నాగయ్య, పార్వతి, విత్తనాభివృద్ధి సంస్థ ఎఇఒ ఎండి.జానీమియా, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.












