వెల్జర్ల (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
వెల్జర్ల గ్రామ రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు నాణ్యమైన విత్తనాల ప్రాముఖ్యతను, వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశాలను వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వెల్జర్ల గ్రామ రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల విత్తనాలను పరిశీలించి, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు.
రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని సురేంద్ర మోహన్ సూచించారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సేవలు, సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన విత్తనాలపై అవగాహన కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా వెల్జర్ల గ్రామ సర్పంచ్ రాత్లావత్ బాబు నాయక్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామానికి ఆహ్వానించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేష్ గౌడ్, వెంకట్ రెడ్డి, భరత్ లహోటి, వెల్జర్ల గ్రామ సర్పంచ్ రాత్లావత్ బాబు నాయక్, కొండన్నగూడ గ్రామ సర్పంచ్ అనురాధ సురేష్ గౌడ్, వెల్జర్ల గ్రామ ఉపసర్పంచ్ దొడల వెంకటేష్ యాదవ్, షాద్‌నగర్ ఏడీఏ రమాదేవి, ఏఓ నిశాంత్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారి హిమబిందు, ఏఈఓలు గోవర్ధన్, తేజ్‌కుమార్, వినయ్, రాంబాబు, హెచ్ఈఓ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
అలాగే వెల్జర్ల గ్రామ నాయకులు కటికెల తిరుపతి యాదవ్, జాంగారి రవి, జాంగారి జంగయ్య, దాస్య నాయక్, దొడ్డి రామదాసు, వార్డు సభ్యులు వెంకటయ్య నాయక్, పవన్ ముదిరాజ్, వట్టెల ప్రవళిక, మహేష్ యాదవ్, రవి నాయక్, నాయకులు కావలి యాదయ్య, సత్యం రెడ్డి, హరిచంద్ర నాయక్, రాజు, వెంకటేష్, ఎర్ర పెంటయ్య, శ్రీను నాయక్, రమేష్, మేళ్లగూడ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కొండన్నగూడ గ్రామానికి చెందిన నేతలు వెంకట్ రెడ్డి, సురేష్ గౌడ్, వై. శ్రీనివాస్ యాదవ్, అంజయ్య గౌడ్, యాదయ్య గౌడ్, మహిపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మల్లేష్ యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.












