Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
లోకేశ్వరం రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహించారు. ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం అనిశ్చితి నేపథ్యంలో, తక్కువ నీటి అవసరమున్న పప్పుధాన్య పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. ఈ మేళా 29 వరకు కొనసాగుతుంది.
లోకేశ్వరం రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్ ఆవరణలోని రైతువేదికలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి గిరి రాజ్ మాట్లాడుతూ, ప్రస్తుత ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షపాతం అనిశ్చితంగా ఉండటంతో రైతులు వరి సాగుపై సందిగ్ధంలో ఉన్నారని తెలిపారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తక్కువ నీటి అవసరమున్న పప్పుధాన్య పంటలైన కంది, పెసర, మినుము, ఉలవలు, అలసంద, కూరగాయల విత్తనాలను ప్రదర్శించామని, రైతులకు అవసరమైన ఇతర పంటల విత్తనాలను కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉంచామని, వీటిని రైతు వేదికలో విక్రయించాలని సూచించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచేందుకు ఈ విత్తన మేళాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం 29వ తేదీ వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గిరి రాజ్, 'ఆత్మ' చైర్మన్ జి నర్సారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, రైతు సుదర్శన్, వ్యవసాయ విస్తరణ అధికారులు మౌనిక, సంగీత, మౌనిక, రుచిత, అజయ్ మరియు రైతులు పాల్గొన్నారు.












