మహబూబునగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 03
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు తర్వాత, అందుకు సంబంధించిన కమిషన్ డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో అనేక ప్రాథమిక సహకార సంఘాలు (పిఎసిఎస్) ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని, నిర్వీర్యం అవుతున్నాయని వనపర్తి జిల్లా రాజనగరం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు మానాజీపేట రఘువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు పరపతి సంఘాలు, పిఎసిఎస్ సొసైటీలు నిర్వీర్యం అవుతున్నాయని, రైతులకు సకాలంలో పంట రుణాలు అందించాల్సిన సింగిల్ విండో సొసైటీలు దివాలా తీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసిన తర్వాత, అందుకు సంబంధించిన కమిషన్ డబ్బులను ప్రభుత్వం సకాలంలో ప్రాథమిక సహకార సంఘాలకు (పిఎసిఎస్) చెల్లించకపోవడంతో అనేక సింగిల్ విండో సొసైటీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని, నిర్వీర్యం అవుతున్నాయని వనపర్తి జిల్లా రాజనగరం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు మానాజీపేట రఘువర్ధన్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు పరపతి సంఘాలు, పిఎసిఎస్ సొసైటీలు నిర్వీర్యం అవుతున్నాయని, రైతులకు సకాలంలో పంట రుణాలు అందించాల్సిన సింగిల్ విండో సొసైటీలు దివాలా తీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వనపర్తి జిల్లాలో మొత్తం 15 సింగిల్ విండో సొసైటీలు ఉండగా, అందులో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 8 సొసైటీలు ఉన్నాయని, వీటికి సంబంధించి ధాన్యం కొనుగోలు కమిషన్ డబ్బులు దాదాపు 15 కోట్ల రూపాయలు బకాయి పడ్డాయని రఘువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, వనపర్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ఎమ్మెల్యే చొరవతో కేవలం ఒక సీజన్‌కు సంబంధించిన 25 డబ్బులు మాత్రమే విడుదల చేయించారని, మిగతా డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మిగతా బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
2024 యాసంగి, 2025 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కమిషన్ డబ్బులు వనపర్తి జిల్లా సివిల్ సప్లై కార్యాలయం నుంచి జిల్లా సహకార శాఖ అధికారి ఖాతాకు జమ అయినప్పటికీ, ఆ డబ్బులు సకాలంలో సొసైటీలకు ఎందుకు అందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పిఎసిఎస్ సొసైటీలతో పాటు మహిళా సంఘాలకు క్వింటాల్‌కు 32 రూపాయల చొప్పున కమిషన్ చెల్లించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, కేవలం మహిళా సంఘాలకు మాత్రమే ఆ మొత్తాన్ని చెల్లించి, పిఎసిఎస్ సొసైటీల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు కమిషన్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, మూడు సీజన్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా, కేవలం ఒక్క సీజన్‌కు సంబంధించిన డబ్బులు కూడా అనేక షరతులతో విడుదల చేశారని రఘువర్ధన్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన డబ్బులతో పిఎసిఎస్ ఉద్యోగుల జీతభత్యాలు, ధాన్యం కొనుగోలు ఖర్చులు, ఇన్చార్జిలుగా పనిచేసిన ఉద్యోగుల జీతాలు, పెండింగ్ ఈఎంఐలు, ఎరువుల కొనుగోలు చెల్లించాలని నిబంధనలు విధించడం సమంజసమేనా అని ప్రశ్నించారు.












