రోడ్డు ప్రమాదంలో నటుడు బోరబండ భాను మృతి
టాలీవుడ్‌లో విలన్ గ్యాంగ్‌లో కనిపించే నటుడు బోరబండ భాను బుధవారం మృతి చెందారు. గండికోటలో మిత్రుడు ఇచ్చిన పార్టీకి హాజరైన ఆయన తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదానికి కొన్ని గంటల ముందు వరకు ఆయన ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపారు. ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం పోస్ట్ చేశారు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు