ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి
ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 5
మండల కేంద్రమైన ముధోల్ కు చెందిన సయ్యద్ ఖాసీం ఆలి(54) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం సయ్యద్ ఖాసీం అలీ ఉదయం తన పంట చేనుకు సమీపంలో గల మహమ్మదీ కుంట చెరువులో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుని కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.