మెట్పల్లి, జూలై 29
మెటపలలబడపోమీపంలోబధాంెలలాజామూాలాఅపపపపాషాపఢీొటటడంోఅడాాలా.పోలీలంఘటాథలాచేషాడఆపలంచా.
మెట్పల్లి బస్ డిపో సమీపంలో బుధవారం తెల్లవారుజామున కూరగాయలు తీసుకెళ్తున్న మినీ బొలెరో వ్యాన్ అదుపుతప్పి పాన్ షాప్‌ను ఢీకొట్టింది. అనంతరం మురికి కాల్వపై ఆగిపోయింది.
ఈ ప్రమాదంలో పాన్ షాప్ వద్ద రాత్రి నిద్రిస్తున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో పాన్ షాప్‌కు నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు.












