మండల కేంద్రానికి చెందిన న్యాకపు సుబాకర్ పిడుగుపాటుకు గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో సుధాకర్ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ వార్త గ్రామంలో విషాదాన్ని నింపింది.
ఘటనపై సమాచారం తెలుసుకున్న స్థానికులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.












